పేదల పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోకూడదా



  • మేధోమధన సదస్సులో జగన్

  • విపక్షం రాజకీయం చేస్తోందని ఆగ్రహం 


సమైక్యఆంధ్రా, అమరావతి: పేద పిల్లలు ఇంగ్లీషు చదువుకోరాదని విపక్షాల ఉద్దేశ్యంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. పెద్ద వాళ్లకే ఇంగ్లీషు చదువులు కావాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వం రోజుకో విషయంపై మేధోమథన సదస్సు నిర్వహి స్తోంది. బుధవారం విద్యా రంగంపై ప్రభుత్వం నిర్వహిస్తోన్న సదస్సులో జగన్ మాట్లాడుతూ, విపక్ష నేతలు 'అసెంబ్లీలో ఒకమాట బయట మరో మాట మాట్లాడతారని మండి పడ్డారు. ఇంగ్లిషు మీడియం బిల్లును అసెంబ్లీలో అడ్డుకున్నారని, దానిని మళ్లీ సభలో పెట్టి ఆమోదించామని చెప్పారు. ఇంగ్లిషు మీడియం తీసు కొస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అవుతుందని కొత్త సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వారి చేతలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా తెలుగునిగౌరవించే ఈ పెద్ద మనుషులు తమ పిల్లలు, మనవళ్లను ఎక్కడ చదివి స్తున్నారు? పేదవారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలట. వారి పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలట' అని జగన్ విమర్శించారు. ఈ విషయంపై కోర్టులకు కూడా వెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను చదివించలేని పరిస్థితులను తల్లిదండ్రులు అధిగమించాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 'పేద విద్యార్థులను కూడా ఉన్న చదువులు చదివించాలి. చాలా మంది తమ పిల్లలను చదివించే స్తోమత లేక మధ్యలోనే ఆపుతున్నారు. ఫీజుల కోసం తల్లి తల్లి దండ్రులు పడుతున్న బాధ అంతా ఇంతాకాదని ఆయన అన్నారు. పేదవారి కుటుంబంలో పిల్లలు కలెక్టరో, లేదా ఓ పెద్ద ఉద్యోగమో చేస్తే పేదరికం నుంచి బయటకు వస్తారు. లేదంటే ఎప్పటికీ వారు పేదరికంలోనే . ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పేదరికానికి ఉన్న ఏకైన పరిష్కారం చదువు. పిల్లలను చదివించ లేకపోతోన్న తల్లిదండ్రులు ఉన్న ఈ ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుటామనీ చుట్టామని జగన్ చెప్పారు. అందుకే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఇంగ్లిషు మీడి యంను తీసుకు వస్తున్నాం' అని ముఖ్యమంత్రి తెలిపారు. తమ పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య కావాలని తల్లి దండ్రులే కోరారని జగన్ చెప్పారు. ఇటు వంటి కార్య క్రమానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ అన్నారు.