అనకాపల్లి, ఏప్రిల్ 24 : అన్ని రంగాల్లో అభివృద్ధి వృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు సైతం కరోనా వైరస్ నుండి తల్లడిల్లి పోతుంటే ముందస్తుగా లాక్‌డౌన్ పాటించ డం వల్ల విశ్వానికే ఆదర్శనీయులమయ్యామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నా ద్ వివరించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రేటు ఋణం పథకాన్ని ఆయన ఎంపీ డా క్టర్ బీవీ సత్యవతితో కలిసి తుమ్మపాల, కశింకోట, మునగపా కలలో శుక్రవారం ప్రారంభించారు. గ్రామసచివాలయాల ఏర్పాటైన సభల్లో ఆయన మహిళల నుద్దేశించి మాట్లాడా రు. గత పాలకులు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల కు ముక్కుపిండిమరీ వడ్డీలకు వడ్డీని వసూలు చేసేవారిని వ్యాఖ్యానించారు. దీనివల్ల మహిళలకు రుణభారం ఎక్కువై ఆర్థిక భారం పెరిగి పోయిన సోదరీమ ణులకు కొంతైనా వెసులు బాటు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ డ్వాక్రా రుణాల ను ఇకపై మహిళ లకు ఇవ్వాలని సం కల్పించినట్టు చెప్పారు. ఈ సదు పాయాన్ని సోదరీమ ణులంతా సద్విని యోగం చేసుకో వారిని ఎంపీ డాక్టర్ సత్యవతి ఆకాంక్షిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు తీసు కున్న నిర్ణయాలు కరోనా వ్యాప్తిని అదుపు చేశాయని పార్టీ నాయకుడు దంతులూరి దిలీప్ కుమార్ పేర్కొన్నా రు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు గొల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు వడ్డీ భారం కారాదని డ్వాక్రాలకు సున్నా వడ్డీ రుణాలు... *ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాద్**