అనకాపల్లి ఏప్రిల్ 28 (సమైక్యాంధ్ర) : .ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వలన నష్టపోయిన రైతులను, కార్మికులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలం అయ్యారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు "బండారు సత్యనారాయణ మూర్తి ,పీలా గోవింద సత్యనారాయణ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ గారు”, గండి బాబ్ది గారు” విమర్శించారు. రైతులు పండిస్తున్న పండ్లు, కూరగాయలను అమ్ముకోవడానికి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలేదని ఆరోపించారు. ఈ రోజు జీవీఎంసీ “80వ వార్డు పరిధిలోని చిన తాడి, తాడి గ్రామాలలో “టీడీపీ నాయకుడు బిఎస్ఎంకే జోగి నాయుడు” ఆధ్వర్యంలో సుమారు “1100 కుటుంబాలకు వారు స్థానిక నాయకుడు “నీల బాబు తో కలిసి భౌతిక దూరాన్ని పాటిస్తూ “కూరగాయలను పంపిణీ చేశారు”. పేదలను ఆదుకోవడానికి చేతులు రాణి ముఖ్యమంత్రి మేఘా సంస్థ వంటి కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల ను ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి “ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి(ఉద్దీపనను)ను ప్రకటించాలని” వారు డిమాండ్ చేశారు. లాక్ డౌన్ కాలంలో పనులు లేక నష్టపోయిన రాష్ట్రంలోని “ప్రతి కార్మికుడి కుటుంబానికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని “డిమాండ్ చేశారు. ప్రజలందరూ కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం “రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనిలో "బిజీగా ఉ న్నారని, దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని మార్చడమే ఉదాహరణని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి తెలుగుదేశం పారీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిరసపల్లి సన్యాసి రావు, కసిరెడ్డి సత్యనారాయణ, వల్లూరు సత్యనారాయణ, కనుమరెడ్డి గోవింద, కటారి శ్రీను, రవి, సూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం