మాజీ ఎమ్మెల్యే పీలా, ఎమ్మెల్సీ బుద్ధ పిలుపు
కశింకోట ప్రమీలా రాణి గార్డెన్లో మహానాడు సన్నద్ధం సమావేశం
భౌతిక దూరానికి ప్రధమ ప్రాధాన్యత.
సమైక్యాంద్రా, కశింకోట: ఈ నెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు సమావేశాలను నిర్వహింస్తామని ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మాజీ శాసనసభ్యులు, నియోజ కవర్గ ఇన్ చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ పిలుపునిచ్చారు. మంగళవారం కశింకోట ప్రమీలారాణి ఉద్యానవనంలో మహానాడు సన్నద్ధం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి కారణంగా మహానాడు జూమ్ అప్లికేషన్లో సహకారంతో జరుగుతుందని, అందరూ నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని వీక్షించాలని కోరారు. రాష్ట్రం మొత్తం మీద 25 వేల మంది, అనకాపల్లి నియోజకవర్గంలో 3 వేల మంది కార్యకర్తలు, నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహానాడులో పాల్గొంటారని తెలిపారు.
వార్డు, గ్రామంలో ఎన్టీఆర్ జయంతి నిర్వహించండి
ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థపకులు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో, వార్డుల్లో కొద్దీ మంది తోనే భౌతిక దూరాన్ని పాటిస్తూ పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాయల మురళి, బుద్దిరెడ్డి చిన్నా, పెంటకోట రాము, వేగి గోపి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, ఉగ్గిన రమణమూర్తి, కోట్ని బాలాజీ, కడిమిశెట్టి నరసింగ రావు, వేగి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.