పీలా చేతులు మీదగా పేదలకు సాయంఇబ్బందులను


అనకాపల్లి,సమైక్యాంద్రా:  పట్టణంలో కాండ్రేగుల రామునాయుడు కోలనీలో అనకాపల్లి శాసన మండలి సభ్యులు బుద్ద నాగజగదీష్, మాజీ ఎమెల్యే పీలా గోవిందసత్యనారాయణ టమాటా, బంగాళదుంప, ఉల్లిపాయలు, పేదలకు అందజేసారు. పార్టీ నాయకలు మళ్ల సురేంద్ర బంగాళదుంప, ఉల్లిపాయలు, పేదలకు అందజేసారు. పార్టీ నాయికలు యల్లా - ఆద్వర్యంలో వీటిని అందజేస్తారు. ఈసందర్భంగా జగదీష్, గోవిందసత్యనారాయణ, మాట్లాడుతూ ఇంటికి పరిమితం కావాలన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపద్యంలో స్వచ్చంద సంస్థల పార్టీ నాయకులు, అందిసున్న సేవలను సది నియోగం చేసుకోవాలన్నారు. పోలీసు అధికారులకు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలన్నారు. రోడ్లపై తిరగవద్దన్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకొనేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దొడ్డి జోగినాయుడు, నగదు కామేష్, మళ్ల కృష్ప, మళ్ల రాంబుజి, దాడి జగదీష్, కొణతాల తులసి మళ్ల గణేష్, రేబాక ఈశ్వరరావు, పొలిమేర ఆనంద్, వేగి కృష్ణ పీలా శ్రీను, అప్పారావు, మహలక్ష్మి, శ్రీను, సురేష్ బానుచందర్, తదితరులు పాల్గొన్నారు.