సింహాచలం శ్రీ వరాహా పుష్కరిణి గబ్బిలాలు మర్రిచెట్టు ప్రాంతంలో
అధికారులు కరోనా వైరస్ పై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి*
సింహాచలం, ఏప్రిల్ 18: భారత్‌లో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్ కనిపించింది. వీటిలో ఈ సూక్ష్మజీవులను గుర్తించడం ఇదే మొదటిసారి. భారత వైద్య పరిశో ధన మండలి (ఐసీ ఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిర్వ హించిన పరిశోధ నలో ఈ విషయం వెల్లడైంది.ఈ రెండు రకాల గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, రౌసెటస్‌గా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, హి మాచల్ ప్రదేశ్, పు దుచ్చేరి రాష్ట్రాల్లోని ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలా ల నుంచి నమూనా ల్లో కరోనా వైరస్ జాడ కనిపించింది. ఈ వైరస్ నిర్ధారణకు ఉపయోగించే ‘రివ ర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ చైన్ రియాక్షన్’ (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించినప్పుడు ‘పాజిటివ్’ ఫలితా లు వచ్చాయి. అయితే ఈ రకం కరోనా వైరస్ వల్ల మానవుల్లో ఇన్ ఫెక్షన్లు కలుగుతా యా అన్నది ఇప్పుడే చెప్పలేమని పరిశో ధకులు తెలిపారు.
98వ వార్డ్ సింహా చలం శ్రీ వరాహా పుష్కరిణి ఆవర ణలో గల పురాత నమైన మర్రిచెట్టు ఉంది ఆ చెట్టుపై వేల సంఖ్యలో గబ్బి లాలు జీవిస్తున్నా యి. టీవీ చానల్స్ మరియు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి స్థాని కంగా నివాసిస్తున్న ప్రజలు గొబ్బిలాల కారణంగా ఏ ఉపద్రవం ముంచు కొస్తుందనని భయబ్రాంతు లకు గురవుతున్నా రు. వీరిని దృష్టిలో ఉంచుకుని వినియో గదారుల హక్కుల సంస్థ చినగదిలి మండల అధ్యక్షుడు విజినిగిరి. బాలభా నుమూర్తి ఆద్వర్యం లో విశాఖ సిటీ సీఆర్వో కార్యదర్శి లోగిశ గణేష్‌తో కలసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల భానుమూర్తి మాట్లా డుతూ ప్రభుత్వ అధికారులు వీరికి దైర్యాన్ని ఇచ్చే విధం గా చర్యలు తీసు కోవాలని అలాగే వరాహా పుష్కరిణి లో కార్యాకలాపాలు యధావిధిగా కొనసా గుతున్నాయి. అందువలన దేవస్థా నం అధికారులు స్పందించి కరోనా వైరస్ ప్రభావం ఉన్నంతవరకూ వరాహా పుష్కరిణి లోపలికి అనుమతి లేకుండా అన్ని ద్వా రాలు మూసివేయా లని కోరుతూ స్థాని కులు కూడా ముంద స్తు జాగ్రత్తలలో భా గంగా గబ్బిలాలు నుండి ఏ విధమైన వైరస్‌లు సోకకుండా పసుపుతో నీళ్లు తయారుచేసి ఆ నీటిని ఇంటి మెుత్తం చల్లుతూ గుగ్గిలంతో దూపం వేయాలని కోరారు.