అమలాపురం, ఏప్రిల్ 8 (సమైక్యాంధ్ర) :కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా నిర్విరామంగా ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు వారికి అమలాపురం ఎర్రవంతెన వద్ద అమలాపురం ఎంఆర్‌పిఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వీధి వెంకటేశ్వరరావు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, రంగాపురానికి చెందిన నేదునూరి లక్ష్మణరావులు మాను ఎస్ట్ రాజేష్ సమక్షంలో పంపిణీ చేసారు. అదే విధంగా అమలాపురంలో ఉన్న సహృదయం గల వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని అలాగే చాలా గ్రామాలలో కరోనా మహమ్మారి రాకుండా బయటకు వెళ్లి కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి కూరగాయలు, బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకోవాలని వీధి వెంకటేశ్వరరావు కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా నిత్యం చేతులు శు భ్రపర్చుకోవాలని, సామాజిక దూరం పాటించడమే మార్గమని అన్నారు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు చెప్పిన లా డౌన్ ప్రజలు ఎవరూ అవసర పనులకు బయయటకు రాకుండా పోలీసు వారికి, వైద్య సిబ్బంది సహకరించాలని, బాధ్యతగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ చేట్ల రామారావు, మల్లవరపు అరుణ తదితరులు పాల్గొన్నారు.