పాక్‌ను మోసం చేసిన చైనా.. ‘అండర్‌వేర్ మాస్కులు’ పంపి అవమానం

న పొరుగు దేశాలైన పాకిస్థాన్-చైనాలో జిగిడీ దోస్తులనే సంగతి తెలిసిందే. ఇద్దరు స్వార్థపరులు స్నేహం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ‘‘మిత్రమా.. మా వాళ్లు మీ వైరస్‌ను మా దేశానికి తెచ్చారు. మా ప్రజలను ఆదుకోడానికి కనీసం మాస్కులు కూడా లేవు. కనీసం మా వైద్యుల కోసం N-95 మాస్కులు పంపించు’’ అని పాక్ ప్రభుత్వం కోరడంతో చైనా వెంటనే స్పందించింది. ‘‘N-95 కంటే కత్తిలా పనిచేసే మాస్కులు పంపిస్తాం.. మిత్రమా, వాటిని చూసి మీరే షాకవుతారు’’ అంటూ చైనా మాట నిలబెట్టుకుంది.


చైనా చెప్పినట్లే పాకిస్థానీలు నిజంగానే షాకయ్యారు. చైనా ప్యాకింగ్ విప్పి చూడగానే మాస్కులైతే కనిపించాయి. కానీ, అవి N-95 మాస్కులు కాదు. అండర్‌వేర్లతో తయారు చేసిన మాస్కులు. వాటిని చూగానే పాకిస్థానీలు నిజంగానే షాకయ్యారు. ఇప్పుడు అవమానంతో కుంగిపోతున్నారు. ఈ ఘటనను పాకిస్థాన్‌లోని వివిధ న్యూస్ ఛానల్స్ ఎండగడుతున్నాయి. ఈ సందర్భంగా భారత ఆర్మీ మేజర్(రిటైర్డ్) గౌరవ్ ఆర్య ఇటీవల పాకిస్థాన్ టీవీ చానెల్‌లో ప్రసారమైన వీడియోను ట్వీట్ చేశారు.

ఆ వీడియోలోని న్యూస్ యాంకర్.. మాస్కుల విషయంలో చైనా తమ దేశానికి సున్నం రాసిందని పేర్కొంది. లో దుస్తులకు ఉపయోగించే క్లాత్‌తో తయారు చేసిన మాస్కులను చైనా పంపిందని, వీటిని ధరించి కరోనా రోగులను ట్రీట్ చేయడం కుదరని పేర్కొంది. ఇలాంటి మాస్కులు పంపి చైనా తమను అవమానించడం తగతని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.