రియోడి జనీరో, ఏప్రిల్ 9: బ్రెజిల్‌కు కష్టకాలంలో అండ గా నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో కృతజ్ఞ తలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలను ఉద్దేశించి జేర్ బోల్సోనారో గురు వారం ప్రసంగించా రు. కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్య లు తీసుకున్నామని, భయపడాల్సిన పనిలేదని బ్రెజిల్ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. కరోనా వైరస్ నివారణ పోరాటంలో ‘గేమ్ చేంజర్’గా భావిస్తు న్న హైడ్రాక్సీక్లోరో క్విన్ విషయంలో తమ అభ్యర్థనపై నరేంద్ర మోదీ సాను కూలంగా స్పందించా రని పేర్కొన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో... కరోనా చికిత్సకు అవసర మయ్యే హైడ్రాక్సీక్లో రోక్విన్ తయారు చేయడానికి కావా ల్సిన ముడి సరుకు ఇవ్వడానికి అంగీక రించారని వెల్లడిం చారు. కాగా, బ్రెజిల్ లో ఇప్పటి వరకు 16 వేల మందికిపై గా కరోనా వైరస్ సోకగా, 822 మంది మృతిచెందారు.
అయితే ఈ ఔషధం కోసం జేర్ బోల్సోనా రో భారత్‌కు ‘సంజీ వని’ లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నివా రణ పోరాటంలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు తమకు సరఫరా చేయాలని మోదీని కోరారు. ‘రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వ తాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారో గ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థప రిచాడు. బార్టిమే యుకు దృష్టిని పునరుద్ధరించాడు. సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగ మించాలి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసా యే అత్యున్నత గౌరవంగా భావిస్తా ను’ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడ