స్పందించిన సమరసత సేవా ఫౌండేషన్


అనకాపల్లి ఏప్రిల్ 8 (సమైక్యాంధ్ర) : సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టి,మత్స్యకార గ్రామాల్లో నిర్మించిన దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు, అదే దేవాలయంలో బాల వికాస కేంద్రాలు నడుపుతున్న మాతాజీ లకు బుధవారం నాడు మునగపాక మండలం చూచుకొండ ,మేల్లిపాక ఎస్సీ కాలనీ కాలనీలలో , రాంబిల్లి మండలం కొత్తపేట ఎస్సీ కాలనీలో గల దేవాలయాల అర్చకులకు, మాతాజీ లకు సమరసత పౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కో కన్వీనర్ గంగుపాము నాగేశ్వరరావు డివిజన్ ధర్మ ప్రచారక్ గంగాధర్ ఐదు కేజీల బియ్యం , కేజీ ఆయిలు, కేజీ కంది పప్పు, కాయకూరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు యాల్లబెల్లి అప్పారావు, సత్తారు కాళీ, గోపి, మాతాజీ లు దేవి, రజిని, శ్రీలక్ష్మి, మండల ధర్మ ప్రచారకులు అమ్మో రియా, వీర మహేశ్వర రావు పాల్గొన్నారు.