ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి.... వైసీపీ నేత విజయసాయిరెడ్డి

 



అనకాపల్లి, సమైక్యాంధ్ర : కరోనా వైరస్ మూలంగా విధించిన లాక్ డౌన్లో పేదలు, వలస కూలీలు, కార్మికులు ఎవరైనా ఆకలితో అలమటించకూడదని, వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన జీవిఎంసీ కార్యాలయంకి విచ్చేసారు. ఈసందర్భంగా పారిశుధ్య కార్మికులకు, వలస కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. అనంతరం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులను వలస కూలీలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే విశాఖ జిల్లాలో వలస కూలీలను గుర్తించి, నిత్యవసర సరుకులు అందజేయడం జరుగుతుంధన్నారు. అలాగే అందరికీ రేషన్ డిపోల ద్వారాగా ఉచితంగా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. రేషన్ షాపులు లేని వారికి కార్డులు పంపిణీ ప్రారంభించడం జరిగిందన్నారు. దాతలు ముందుకు వచ్చి, పేదలను ఆదుకోవాలన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కృతనిత్యంతో ఉందన్నారు. పారిశ్రామిక వేత్త సుదాకర్ 3, లక్షల రూపాయలు, శ్రీనురెడ్డి 2 లక్షల రూపాయలు చెక్కులను ఆయనకు అందించారు. సుమారు 230 మంది పారిశుధ్య కార్మికులకు బియ్యం కందిపప్పు, నూనె, తదితర వస్తువులను అందజేసారు. సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావువు, ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్, మాజీ మంత్రి దాడి వీరభద్రదరావు అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ నియోవజర్ల పరిశీలకులు దాడి రత్నాకర్, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, ఆపార్టీ నాయకులు మళ్ల బుల్లిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, గొర్లి సూరిబాబు, మాజీ చైర్మన్ కొణతాల జగన్, డాక్టర్ విష్నుమూర్తి, జోనల్ కమీషన్ శ్రీరామమూర్తి, ఆర్డీవో సీతారామారావు, మాజీ వైస్ చైర్మన్ ఎల్లపు చంద్ర మాజీ వైస్ చైర్మన్ ఎల్లపు చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు అభిమానులు విచ్చేసారు.