సిరిపురం, సమైక్యాంధ్ర: స్వాతంత్ర్య సమర యోధులు, వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి గౌతు లచ్చన్న వర్గంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైసిపి నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. గాజువాక : జివిఎసి 87వ వార్డులో స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న వర్గంతి వైసిపి ఆధ్వర్యాన గాజువాక ఇనాఛార్జి యువ నాయకులు తిప్పల దేవ రెడ్డి నాయకత్వాన ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానకి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోవింద్, వెంకటరమణ పాల్గొన్నారు.
కలెక్టరేట్ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్గంతి నగరంలోని గ్రీన్ పార్కు జంక్షన్లో నిర్వహించారు. శ్రీ శయన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యాన సంఘం అధ్యకులు తోట వాసుదేవరావు ముందుగా గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమా వేసి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూడా గ్రీన్ పార్కు జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.