ఎంవిపి.కాలనీ సమైక్యాంధ్ర : మామిడి పంటను రవాణా చేసుకునేందుకు ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైళ్లను నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం జి. సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి యేటా వాల్తేర్ డివిజన్లోని నోడల్పయింట్ విజయనగరం నుంచి న్యూఢిల్లీ ఆదర్శనగర్‌కు మామిడిపండ్లను ఎగుమతిచేసే రైళ్లను నడుపుతుంది. ఈ ఏడాది లా డౌన్ అమలులో ఉండడంతో మామిడి రైతులు మామిడిపండ్ల రవాణాగురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పాలకులు, మామిడి వ్యాపారుల సమన్వయంతో రైల్వే అధికారులు చొరవ తీసుకుని ఆరు పార్శిల్ వ్యాన్లతో, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ బోగీలతో ప్రత్యేక పార్శిల్ రైలును నడుపుతున్నట్లు ఆయన తెలిపారు.
మామిడి రవాణాకు ప్రత్యేకరైళ్లు